శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

21-02-2022 సోమవారం రాశిఫలితాలు - సదాశివుని ఆరాధించడంవల్ల శుభం...

మేషం :- వ్యాపారస్తులకు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అవుతుంది. విదేశీ ప్రయాణాలు నిరుత్సాహ పరుస్తాయి. మీరు ఇతరులతో సంభాషించడం మంచిది కాదని గమనించండి. మీ సంతానం విద్య, వివాహ విషయాలపట్ల శ్రద్ధ కనపరుస్తారు. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో కొంత చికాకులు తప్పవు.
 
వృషభం :- చేపట్టిన వ్యాపారాల్లో ఒకింత పురోగతి కనిపిస్తుంది. స్త్రీలకు తల, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా వుంటాయి. దుబారా ఖర్చులు నివారించటం సాధ్యపడక పోవచ్చు. ఒక సమస్య పరిష్కారం కావటంతో కోర్టు వాజ్యాలు ఉపసంహరించుకుంటారు. రాజకీయాలలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి.
మిధునం: - వ్యాపారాల్లో నిలదొక్కుకోవటంతో పాటు అనుభవం గడిస్తారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. గిట్టనివారికి హితవు చెప్పి భంగపాటుకు గురవుతారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ప్రేమికులకు పెద్దల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం :- బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. మీ సంతానం విద్య, వివాహ విషయాలపట్ల శ్రద్ధ కనపరుస్తారు. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించటం మంచిది కాదు. అధికారులతో సంభాషించేటపుడు మెళుకువ అవసరం. 
 
సింహం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. చివరి క్షణంలో చేతిలో ధనం ఆడక ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల రాకతో దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టునపుడు పునరాలోచన అవసరం.
 
కన్య :- ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యముగానైనా సంతృప్తికరంగా సాగుతాయి. స్త్రీలతో కలహములు, అన్ని కార్యములయందు విఘ్నములు ఎదుర్కొంటారు. పెద్దలతో ఆస్తి వ్యవహారాలు సంప్రదింపులు జరుపుతారు.
 
తుల :- రాజకీయ నాయకులు సభాసమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులు అందరితో సఖ్యతగా మెలుగుతూ తమ పనులను సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరు కావటంతో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. ఒక విషయంలో సోదరుతో విభేదిస్తారు.
 
వృశ్చికం :- కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. స్త్రీలకు విలువైన వస్తువుల కొనుగోళ్ళలో ఏకాగ్రత వహించండి. రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు. ఉపాధ్యాయులకు విద్యార్ధుల నుండి చికాకులను ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపులభిస్తుంది.
 
ధనస్సు :- ఏజెంట్లు, బ్రోకర్లు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు ఒక పత్రికా ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ప్రజలకు ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి.
 
మకరం :- కుటుంబ సభ్యుల నుంచి విమర్శలను ఎదుర్కుంటారు. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. విశేషాలు మీరు ఊహించిన విధంగానే ఉంటాయి. విద్యార్జనులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఏజెంట్లు, బ్రోకర్లు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
కుంభం :- రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. నిర్మాణ పనులో సమస్యలు తలెత్తుతాయి. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. పట్టుదలతో శ్రమించే మీకు సన్నిహితుల సాయంతోడవుతుంది.
 
మీనం :- కాంట్రాక్టర్లకు రావలసిన పాత బిల్లులు మంజూరవుతాయి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పటం మంచిదికాదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు వాయిదా పడతాయి.