శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

24-02-2022 గురువారం రాశిఫలితాలు - సాయిబాబా గుడిలో అన్నదానం చేసిన...

మేషం :- రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల జాగ్రత్త అవసరం. మీ శక్తి సామర్థ్యాలు ఎదుటివారిని ఆశ్చర్యపరుస్తాయి. వైద్య, ఇంజనీరింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎదుటివారితో మితంగా సంభాషించటం క్షేమదాయకం.
 
వృషభం :- ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. బంధువులను కలుసుకుంటారు. అధ్యాపకులకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
మిథునం :- బ్యాంకు పనుల్లో జాప్యం, చికాకులు ఎదుర్కుంటారు. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఏయత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు.
 
కర్కాటకం :- కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఏ వ్యక్తికి అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. మీ శ్రీమతిని నొప్పించకుండా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మందలింపులు తప్పవు. కుటుంబంలో ఖర్చుల నిమిత్తం ఎక్కువ ధనం వెచ్చించవలసి వస్తుంది.
 
సింహం :- ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం. కొన్ని అనుకోని సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ఉద్యోగస్తులు అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు.
 
కన్య :- పత్రిక, మీడియా సంస్థల వారు అకారణంగా మాటపడవలసి వస్తుంది. భాగస్వామి వ్యాపారాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
తుల :- ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. విందులలో పరిమితి పాటించండి. విద్యార్థులకు కొన్ని నిర్భందాలకు లోనవుతారు. వాగ్వివాదాలకు, ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి
 
వృశ్చికం :- వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో ఒత్తిడి, చికాకు కలిగిస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాలు, హామీలు, ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. కొంతమంది మీతో స్నేహం నటిస్తూనే మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు.
 
ధనస్సు :- మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. కోర్టు వ్యవహరాలు అనుకూలిస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
 
మకరం :- ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. ఖర్చులు అదుపుకాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. ప్రేమికుల మధ్య ఇతరుల వల్ల విభేదాలు తలెత్తుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి.
 
కుంభం :- బంధు మిత్రులతో మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
మీనం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిదికాదు. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి.