సంబంధిత వార్తలు
- నిరుపేద విద్యార్థిని ఎం.శ్రీలేఖకు ల్యాప్‌టాప్ అందించిన గవర్నర్ తమిళసై సౌందర రాజన్
- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
- శ్రీవారి సేవలో తెలంగాణ - పుదుచ్చేరిన గవర్నర్ దంపతులు
- ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి అస్తమయం బాధాకరం
- రాజ్ భవన్ దర్బార్ హాలులో ఘనంగా వివేకానందుని జయంతి వేడుకలు
మార్చి 7వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఏపీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7వ తేదీన ప్రారంభం కానుంది. మార్చి నెలాఖరు వరకు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 7న తొలిరోజు సమావేశాల్లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల అసెంబ్లీ సంతాపం వ్యక్తం చేయనుంది.
మార్చి 8న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. మార్చి 11 లేదా 14న అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రూ.2.30 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించగా.. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. కాగా ప్రస్తుత బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
