గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 15 జనవరి 2022 (13:24 IST)

ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి అస్తమయం బాధాకరం

ప్రముఖ పండితులు, ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం చెంద‌డంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. ఆయ‌న మ‌ర‌ణించారన్న వార్త బాధ కలిగించింద‌ని ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రి చంద‌న్, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు సంతాపం తెలిపారు. 
 
 
ఉగాది రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మల్లాది చంద్రశేఖర శాస్త్రి చెప్పే విశేషాలు ప్రతి తెలుగు వ్యక్తికీ చిరపరిచితమేన‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. పురాణ, ఇతిహాస, వేద విశేషాలు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా, అధ్యాత్మిక చింతన పెంచేలా చంద్రశేఖర శాస్త్రి ఉపన్యాసాలు సాగేవ‌ని పేర్కొన్నారు. ధర్మ సందేహాలు, ధర్మ సూక్ష్మాలు కార్యక్రమాల ద్వారా హిందూ ధర్మంపై అవగాహన పెంచార‌ని కొనియాడారు.  చంద్రశేఖర శాస్త్రి ఆత్మకు శాంతి చేకూరాలని, సద్గతులు ప్రాప్తించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాన‌ని నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.