గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (17:15 IST)

కేసీఆర్ ఎన్ని డ్రామాలకు తెరతీసినా బీజేపీ ట్రాప్‌లో పడదు: బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. బీజేపీ పోరాటాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. 
 
ప్రధానికి సీఎం కేసీఆర్ రాసిన లేఖ పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా వుందని చెప్పుకొచ్చారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేంద్రంపై ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు.
 
ఆనందంతో సంక్రాంతి చేసుకోవాల్సిన రైతులు, ఉద్యోగులు.. ప్రభుత్వ తీరు వల్ల కన్నీళ్లతో సకినాల పిండి తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ఎన్ని డ్రామాలకు తెరతీసినా.. బీజేపీ ఆయన ట్రాప్‌లో పడదని అన్నారు. 317 జీవోను సవరించేదాకా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.