గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (13:19 IST)

కేసీఆర్‌ జైలుకెళ్లే రోజు దగ్గర పడింది: బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్‌ జైలుకెళ్లే రోజు దగ్గర పడిందని, ఈ విషయం తెలిసే సానుభూతి కోసం కమ్యూనిస్టులు, ఇతర పార్టీలతో భేటీ అవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పారు. తేజస్వీ తండ్రి లాలూ పశుగ్రాసం కేసులో జైలుకెళ్లి వచ్చారని, బహుశా ఆ అనుభవాలు చెప్పడానికే ఆయన ప్రగతి భవన్‌కు వచ్చి ఉంటారని ఎద్దేవా చేశారు. 
 
కాగా, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సంజయ్‌ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వేలకోట్లు దోచుకుంటే.. కేసీఆర్‌ లక్షల కోట్లు దోచుకున్నారని, దాన్ని దాచుకోవడం ఎలా అనే అంశంపైనే తేజస్వీ యాదవ్‌తో సమావేశం జరిగినట్లుందని ఎద్దేవా చేశారు. 
 
ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో 317పై తాము చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకే సీఎం కేసీఆర్‌.. వామపక్షాలు, ఆర్జేడీ నేతలతో భేటీ పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు.