మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 జనవరి 2022 (09:31 IST)

శ్రీవారి సేవలో తెలంగాణ - పుదుచ్చేరిన గవర్నర్ దంపతులు

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని తెలంగాణ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ దంపతులు ఆదివారం ఉదయం దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 
 
గవర్నర్ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు, వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. 
 
ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్టు చెప్పారు. అలాగే, ప్రతి ఒక్కరూ విధిగా కరోనా టీకాను వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.