1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. War begins, not to invade Ukraine: Putin

ఉక్రెయిన్‌ పైన సైనిక చర్య, ఆక్రమించుకోవడానికి కాదు: పుతిన్, బైడెన్ కన్నెర్ర

War
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పైన మిలిటరీ ఆపరేషన్ ప్రకటించిన తర్వాత ఉక్రెయిన్‌లోని కైవ్, ఖార్కివ్ ప్రాంతాలతో సహా ఇతర ప్రాంతాలలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రష్యా చర్యలో జోక్యం చేసుకునే ఏ విదేశీ ప్రయత్నమైనా వారు ఎన్నడూ చూడని పరిణామాలు చవిచూస్తారని పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు పుతిన్.

 
తూర్పు ఉక్రెయిన్‌లోని పౌరులను రక్షించడానికి ఈ దాడి అవసరమని పుతిని చెప్పడాన్ని అమెరికా ఆక్షేపించింది. మరోవైపు అమెరికా, దాని మిత్రదేశాలు NATOలో చేరకుండా ఉక్రెయిన్‌ను నిరోధించాలని, మాస్కో భద్రతా హామీలను అందించాలని రష్యా చేసిన డిమాండ్‌ను విస్మరించాయని పుతిన్ ఆరోపించారు.

 
ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవడం రష్యా లక్ష్యం కాదని ఆయన అన్నారు. కాగా ఉక్రెయిన్ దేశం పైన ప్రేరేపిత- అన్యాయమైన దాడిని ఖండిస్తున్నామనీ, ప్రపంచం ముందు రష్యా జవాబుదారీగా నిలబడుతుందని ఆయన అన్నారు.
తర్వాతి కథనం
బయటకు రావొద్దు, బాంబులు పడుతున్నాయ్: ఉక్రెయిన్‌లో అత్యవసర పరిస్థితి