శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (15:20 IST)

బయ్యారం ఉక్కుపై తెరాస ఎంపీల నిరసనగళం

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన లోక్‌సభ సభ్యులు బయ్యారం ఉక్కుపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం తెలంగాణ హక్కు, రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఈ డిమాండ్ ఉందని తెరాస లోక్‌‍సభపక్ష నేత నామా నాగేశ్వర రావు, ఎంపీ మాలోతు కవిత, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. 
 
వారు ఇదే అశంపై మీడియాతో మాట్లాడుతూ, విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వాల్సిందేనని, ఈ బాధ్యత కేంద్రానిదే అని అన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు సాధ్యంకాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గిరిజనులను ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు, కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా బయ్యారంలో నిరసన చేపడుతామని వారు వెల్లడించారు.