సంబంధిత వార్తలు
- బాబోయ్ న్యూఇయర్ ... 24 గంటల్లో 18.16లక్షలకుపైగా కరోనా కేసులు
- ఒమిక్రాన్.. పెళ్లి క్యాన్సిల్ అయితే ఇక బాధపడనక్కర్లేదు..
- ఆ మహిళ నాలుగు డోసుల కోవిడ్ టీకా తీసుకున్నా.... కరోనా పాజిటివ్
- సంక్రాంతి తర్వాత మూడో ముప్పు : హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు
- బుసలు కొడుతున్న ఒమిక్రాన్ వైరస్ - 961కి చేరిన పాజిటివ్ కేసులు
టీఆర్ఎస్‌లో కరోనా కలకలం: కేశవరావుకు పాజిటివ్
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే సామాన్యుల నుంచి సెలెబ్రిటీ వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్‌లో కరోనా కలకలం రేగింది. టిఆర్‌ఎస్ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యులు కేశవరావుకు కరోనా సోకింది. కాస్త అనారోగ్యంగా వుండటంతో కరోనా పరీక్ష చేయించుకున్న ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
కానీ ప్రస్తుతం కేకే ఆరోగ్య పరిస్థితికి ఎలాంటి సమస్య లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లో వుండాలని డాక్టర్లు సూచించారు. దీంతో తన నివాసంలోనే ఉంటూ ఎంపి కేశవరావు చికిత్స పొందుతున్నారు. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఇటీవలే పార్లమెంటు సమావేశాలు ముగియడంతో కేశవరావు దేశ రాజధాని న్యూఢిల్లీ నుండి హైదరాబాద్‌కు వచ్చారు. కానీ సమావేశాల సమయంలో ఢిల్లీలోనే వున్న ఆయన సహచర ఎంపీలు, రాష్ట్ర మంత్రుల బృందంతో కలిసి కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌ని కలిశారు. దీంతో కేకేకు సన్నిహితంగా వున్న వారు కరోనా టెస్టులు చేయించుకునే పరిస్థితి ఏర్పడింది.
తర్వాతి కథనం
