1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Anna Lezhneva makes a request regarding her name like this...

Anna Konidala: అన్నా లెజ్నెవా తన పేరు విషయంలో విన్నపం చేస్తుందిలా...

Anna Lezhneva change to Anna Konidela
Anna Lezhneva change to Anna Konidela
నా పుట్టినరోజు దగ్గరపడుతున్న తరుణంలో,నా గురించి రాయడానికి ఇదే సరైన సమయం అని నాకు అనిపించింది. ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించినప్పటి నుంచీ నేను దీని గురించి రాయాలని అనుకుంటూనే ఉన్నాను. రాసి డిలీట్ చేయడం, మళ్లీ రాయడానికి ప్రయత్నించడం...ఇలా చాలాసార్లు జరిగింది. కానీ దీన్ని ఎలా చెప్పాలో నాకు సరైన విధానం దొరకలేదు.
 
చాలామందికి నేను మొదట 'అన్నా లెజ్నెవా' (Anna Lezhneva)గానే పరిచయం అయ్యాను, ఎందుకంటే మా వివాహం గురించి వార్తలు వచ్చినప్పుడు ఆ పేరే ఎక్కువగా వినిపించింది. విచిత్రం ఏమిటంటే, ఆ ఇంటిపేరు (surname) కనిపించే చివరి అధికారిక పత్రం మా వివాహ ధృవీకరణ పత్రం మాత్రమే.
 
ఆ రోజున, నేను నా భర్త ఇంటిపేరును స్వీకరించి 'అన్నా కొణిదెల' (Anna Konidala)గా మారాను. కాబట్టి, మీరు ఇప్పటివరకు ఇది చదివి ఉంటే, నాదొక చిన్న అభ్యర్థన.
 
దయచేసి నన్ను 'అన్నా కొణిదెల' అని పిలవండి. అదే నా పేరు, ఆ పేరుతోనే నేను నిజమైన 'నా'లా భావిస్తాను.
 అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇది నాకు చాలా ముఖ్యమైన విషయం.
About Writer
దేవీ
తర్వాతి కథనం
ఆహా'లో స్ట్రీమింగ్ కు వస్తున్న హర్షిత్ రెడ్డి నటించిన దీవాన మూవీ