శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 31 డిశెంబరు 2021 (10:23 IST)

బాబోయ్ న్యూఇయ‌ర్ ... 24 గంటల్లో 18.16లక్షలకుపైగా కరోనా కేసులు

ఒమిక్రాన్ మూకుమ్మ‌డిగా వ్యాప్తి చెందుతోంది. ప్ర‌పంచాన్ని మ‌రోసారి క‌రోనా  మూడో వేవ్ ముంచెత్తుతోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ ద‌శ‌లో కొత్త సంవ‌త్స‌రం ప్ర‌వేశిస్తుండ‌టంతో, ప్ర‌పంచవ్యాప్తంగా నిర్వ‌హించే న్యూఇయ‌ర్ వేడుక‌లు మ‌రింత‌గా క‌రోనా వ్యాప్తికి దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని ఆరోగ్య శాస్త్ర‌వేత్త‌లు ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు.
 
 
24 గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 18.16 లక్షలకుపైగా కొత్త కేసులు బయటపడ్డాయి. ఒక్క అమెరికాలోనే 24 గంటల్లో 5.37లక్షల కరోనా కేసులు, 1300కు పైగా మరణాలు నమోదయ్యాయి. ఇక భారత్‌లోనూ కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా 16,764 కేసులు, 220 మరణాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 91,361గా ఉంది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం  దేశంలో ఒమిక్రాన్‌ కేసులు 1,270కి చేరాయి.