మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 30 డిశెంబరు 2021 (10:54 IST)

విశాఖ‌లో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు...బీచ్ రోడ్డు క్లోజ్!

నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లంటూ కుర్ర కారు రెచ్చిపోవ‌డం స‌హ‌జం. రోడ్ల‌పై బైక్ ర్యాలీలు, తాగి తంద‌నాలు చేయ‌డం వ‌ల్ల వాళ్ల‌కే కాదు... చుట్టుప‌క్క‌ల వారికి కూడా న‌ష్టం. అందుకే విశాఖ‌లో నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించారు.
 
 
డిసెంబర్ 31 సాయంత్రం 6 గంటల నుండి ఆర్కే బీచ్ రోడ్డు మూసివేస్తున్నారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్, బిఆర్ టిఎస్ సహా ఇతర రోడ్లు క్లోజ్ చేస్తున్నారు. ప్లబ్లిక్ గా బయటకి వచ్చి సెలెబ్రెషన్ లు చెయ్యడం, కేకులు కట్ చేయడం లాంటివి నిషేధం విధించారు. 
 
 
31 డిసెంబర్ అర్ధ రాత్రి  బైకులపై తిరుగుతూ హడావుడి చేసేవారిపై కఠిన చర్యలుంటాయ‌ని పోలీసులు తెలిపారు. రెస్టారెంట్ లు, వైన్ షాపు లు నియమిత టైమింగ్ ప్రకారం మాత్రమే తెరిచి ఉంచాలి. ఎక్కడా డీ జే లు పెట్టకూడదు. ఇంట్లో కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ చేసుకోండి. నిబంధనలు అతిక్రమిస్తే పోలీస్ స్టేషన్ లో  న్యూ ఇయర్ రోజు గడపాల్సి వస్తుంద‌ని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా హెచ్చ‌రించారు.