శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (15:19 IST)

కొత్త సంవత్సరం వేడుకలు : హైదరాబాద్‌ నగరంలో కఠిన ఆంక్షలు

కొత్త సంవత్సర వేడుకలను నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో కఠిన ఆంక్షలు విధించారు. ఈ మేరకు మూడు పోలీస్ స్టేషన్ పరిధిల్లో ఈ ఆంక్షలు అమలుకానున్నాయి. డిసెంబరు 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి ఒకటో తేదీ ఉదయం 5 గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయి. 
 
ఈ ఆంక్షల్లో భాగంగా, సైబర్ టవర్స్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి, బయోడైవర్శిటీ, మైడ్ స్పేస్, ఫోరం మాలో - జేఎన్టీయూ, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, బీజేఆర్, బేగంపేట, ప్యారడైజ్, ప్యాట్నీ, తెలుగు తల్లి, నారాయణగూడ, బషీర్ బాగ్, ఎల్బీ నగర్, మలక్‌పేట, నెక్లెస్ రోడ్డు, మెహిదీపట్నం, పంజాగుట్ట ఫ్లై ఓవర్లతో పాటు.. వీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌ను పోలీసులు మూసివేయనున్నారు. 
 
పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వే పైకి టిక్కెట్లు ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నారు. అలాగే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు‌పైకి కేవలం లారీలు, సరకుల వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ప్రయాణ టిక్కెట్లు ఉన్నవారికి మాత్రం ఓఆర్ఆర్‌పై వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. క్యాబ్ డ్రైవర్లు విధిగా యూనిఫాం ధరించడంతో పాటు.. వాహనం, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి ఖచ్చితంగా అన్ని ఒరిజినల్స్ తమ వద్ద ఉంచుకోవాలని పోలీసులు సూచించారు.