ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త.. ఏంటది?
ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 7,218 గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు రంగం సిద్ధం చేసుకుంది. తాజా పోస్టులను జిల్లా యూనిట్‌గా భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది.
ఈ నేపథ్యంలో వాలంటీర్ పోస్టుల భర్తీకి నెలలో రెండుసార్లు జాయింట్ కలెక్టర్లు నోటిఫికేషన్‌లు జారీ చేయనున్నారు. ఖాళీల వివరాలను ప్రతినెల 1, 16వ తేదీల్లో ఎంపీడీవోలు, పురపాలక శాఖ కమిషనర్‌లు కలెక్టర్లకు సమర్పించాల్సి ఉంటుంది.
అలాగే సరైన కారణం లేకుండా విధులకు గైర్హాజరయ్యే వాలంటీర్లను తొలగిస్తారు. ఏడో రోజున వాలంటీర్ స్థానం ఖాళీ అయినట్లు అధికారులు నోటిఫై చేసి జాయింట్ కలెక్టర్‌కు నివేదిక అందించాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.