బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (14:01 IST)

ముగిసిన గౌతం రెడ్డి అంత్యక్రియలు - సీఎం జగన్ చివరి చూపు...

ఏపీ మంత్రి గౌతం రెడ్డి అంత్యక్రియలు బుధవారం ఉదయం ముగిశాయి. ఈ అంత్యక్రియల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొని తన సహచరుడుని చివరి చూపు చూసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత గౌతం రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి దహన సంస్కారాలు పూర్తిచేశారు. ఈ అంత్యక్రియలు పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. సీఎం జగన్ దంపతులతో పాటు ఏపీ మంత్రులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. 
 
ఈ అంత్యక్రియల్లో వైకాపా కార్యకర్తలు, గౌతం రెడ్డి అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చి, తమ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇవి నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగాయి. ఇందుకోసం గౌతం రెడ్డి భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో నెల్లూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయగిరికి తరలిచారు. సీఎం జగన్ తాడేపల్లి నుంచి ఉదయగిరికి చేరుకుని నివాళులు అర్పించిన తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు.