సంబంధిత వార్తలు
- ఆంధ్రాలో ఏ క్షణమైనా ఎన్నికలు : టీడీపీ నేత అచ్చెన్నాయుడు
- 3న మంత్రి గౌతం రెడ్డి పెద్ద కర్మ - ఏపీ మంత్రివర్గం భేటీ వాయిదా
- కొత్త రాజధాని విశాఖ అని ఏం పీకారు.. వివేకా హత్య జగన్కు తెలిసే జరిగింది..?
- అవినాష్ రెడ్డి బీజేపీలో చేరుతారు.. సీబీఐకీ ఇస్తే 11కేసులకుతోడు 12 కేసులు అవుతాయి..
- నేడు జగనన్నతోడు నిధులు విడుదల
అమరావతి నిర్మాణానికి అక్షరాలా రూ.లక్ష కేటాయింపు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నవ్యాంధ్రపై ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కేంద్ర సర్కారు కక్ష కట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత నెలలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారమన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో అమరావతిలో సచివాలయ నిర్మాణానికి కేవలం లక్ష అంటే లక్ష రూపాయులు మాత్రమే కేటాయించింది.
మొత్తం రూ.1214.19 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం మొదలుపెట్టిన కేంద్రీయ సచివాలయం కోసం ఈ లక్ష రూపాయల కేటాయింపులు చేసింది. గత యేడాది కూడా ఈ పద్దు కింద కేంద్రం రూ.లక్ష మాత్రమే కేటాయించడం గమనార్హం.
నిజానికి ఏపీ ముంఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని ఎపుడో అటకెక్కించింది. మధ్యలో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. న్యాయ వివాదాల నేపథ్యంలో ఈ మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అధికారికంగా అమరావతేనని కేంద్రం కూడా గుర్తించింది.
అదేసమయంలో అమరావతిలో రూ.6.69 కోట్ల వ్యయంతో జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ (జీపీఏవో, కేంద్ర ఉద్యోగుల నివాసాలు) కోస భూమి కొనుగోలుకు కూడా కేంద్రం రూ.లక్ష మాత్రమే కేటాయించడం గమనార్హం. దీని కోసం ఆర్థిక సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వం రూ.4.48 కోట్లను ఖర్చు చేయగా, ఈ ఆర్థిక బడ్జెట్‌లో రూ.లక్ష మాత్రమే కేటాయించడం గమనార్హం.
తర్వాతి కథనం
