సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (12:14 IST)

అవినాష్ రెడ్డి బీజేపీలో చేరుతారు.. సీబీఐకీ ఇస్తే 11కేసులకుతోడు 12 కేసులు అవుతాయి..

తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేసిన నిందితులకు శిక్షపడేందుకు శాయశక్తులా పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె డాక్టర్ సునీత సీబీఐ సంచలన వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
కేసును సీబీఐకు అప్పగిస్తే వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి బీజేపీలో చేరిపోతాడని సీఎం జగన్ అన్నట్టు సునీత స్టేట్మెంట్‌లో పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, వైఎస్ అవినాష్‌పై 11 కేసులు ఉన్నాయి, ఇది 12వ కేసు అవుతుందని జగనన్న అన్నారని సీబీఐకు ఆమె వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. 
 
మరోవైపు, ఈ కేసులో అనుమానితుడుగా ఉన్న గంగాధర్ రెడ్డి, వివేకానంద రెడ్డి కుమార్తె సునీతనే తనను ప్రలోభాలకు గురిచేసిందని చెప్పినట్టు ఓ వార్తా కథనాన్ని జగన్ మీడియా ప్రచురించడం గమనార్హం. 
 
కాగా, తన తండ్రి హత్యపై సునీత తొలి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయపోరాటం చేస్తున్నారు. గత 2020 జూలై 7వ తేదీన సీబీఐ అధికారులు ఇచ్చిన వాంగ్మూలం‌ ఇదేనంటూ మీడియాలో రిపోర్టులు కూడా వచ్చాయి. ఆ స్టేట్మెంట్‌లో సునీత అనేక సంచలన విషయాలను వెల్లడించారు. 
 
"మా నాన్నను ఎవరు హత్య చేశారో పులివెందులలో చాలా మందికి తెలుసు. హంతకులెవ్వరో తేల్చాలని అన్నను కోరా. అనుమానితుల పేర్లు కూడా చెప్పా. వాళ్ళను ఎందుకు అనుమానిస్తున్నావ్.. నీ భర్తే హత్య చేయించాడేమోనని అన్యాయంగా మాట్లాడారు. అయితే సీబీఐతో విచారణ చేయించాలని సవాల్ చేశాను. సీబీఐకు ఇస్తే ఏమవుతుంది. అవినాశ్ రెడ్డి బీజేపీలో చేరుతారు. అతడికేమీ కాదు. 11 కేసులకు మరొకటి తోడై పన్నెండు కేసులు అవుతాయ్ అంటూ జగన్ మాట్లాడినట్టు సునీత వెల్లడించినట్టు మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి.