మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (15:33 IST)

బీహార్ మాజీ సీఎం లాలూకు ఐదేళ్ళ జైలు - జరిమానా

బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ మాజీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో కేసులో ఐదేళ్ళ జైలుశిక్ష పడింది. అలాగే, రూ.60 లక్షల అపరాధం కూడా విధించారు. ఈ మేరకు పాట్నాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. గడ్డి కుంభకోణం కేసులో ఈ తీర్పును వెలువరించింది. 
 
లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డొరండో ట్రెజరీ నుంచి అక్రమంగా రూ.139.35 కోట్ల మేరకు విత్ డ్రా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపింది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇటీవల లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా తేల్చింది. సోమవారం శిక్షను ఖరారు చేసింది. కాగా, ఇప్పటికే ఓ దాణా స్కామ్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ శిక్షను అనుభవిస్తున్న విషయం తెల్సిందే.