బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (15:11 IST)

మోహ‌న్‌బాబు సినిమాలో లెస్‌బియ‌న్ క‌థ వుంది!

Manchu Mohan Babu
ప్రముఖ నటుడు మోహన్‌ బాబు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'సన్‌ ఆఫ్‌ ఇండియా' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైమండ్‌ రత్న బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనా, ప్రజ్ఞా జైస్వాల్‌, శ్రీకాంత్‌, అలీ, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి మోహన్‌బాబు స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ఆసక్తికర కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.
 
కాగా, ఈ సినిమా క‌థ గురించి మోహ‌న్‌బాబు చెబుతూ, ఓ వ్య‌క్తి జీవితంలో రాజ‌కీయ‌నాయ‌కుడు ప్ర‌వేశంతో ఏవిధంగా మారింది? అనేది పాయింట్‌. క‌థ ప్ర‌కారం నాపై డ్యూయ‌ల్ సాంగ్ లేదు. ఇప్ప‌టి ట్రెండ్ ప్ర‌కారం కిస్‌లు వుండాల‌ని పెట్టాల్సివ‌చ్చింది. అది కూడా అమ్మాయి అబ్బాయి కాదు. ఇద్ద‌రు అమ్మాయిల‌మ‌ధ్య కిస్సింగ్ సీన్స్ వుంటాయి. ఇవి ఏ సంద‌ర్భంలో వ‌చ్చాయి. అనేవి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మోహ‌న్‌బాబు సినిమాలంటే మంచి మెసేజ్ వుంటుంద‌ని పేరు వుంది. ఈ సినిమాకూడా ఆ పేరును వ‌మ్ము చేయ‌డ‌ని తెలిపారు. మ‌రి ఇద్ద‌రు అమ్మాయిల ముద్దుసీన్లు ఎందుకు పెట్టార‌నేదానికి స‌మాధానం చెబుతూ, ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌కు స‌రిప‌డా కొన్ని అంశాలు పెట్టాల్సివ‌చ్చింద‌ని తెలిపారు. అయితే నేను సినిమాలో ఎవ‌రికీ ముద్దు పెట్ట‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.