మరో వివాదంలో చిక్కున్న బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి మరో వివాదంలో చిక్కుకుంది. ఆమెతో పాటు ఆమె సోదరి షమిత, వారి తల్లి సునందలకు ముంబైలోని అంధేరి కోర్టు తాజాగా సమన్లు జారీచేసింది. ఈ నెల 28వ తేదీన ఈ ముగ్గురూ కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకు చెందిన ఓ పారిశ్రామికవేత్త వద్ద ఈ ముగ్గురు కలిసి రూ.21 లక్షల రుణాన్ని తీసుకుని తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అంశంపై జుహూ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు కూడా నమోదైంది. ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో కోర్టు వీరికి సమన్లు జారీ చేసింది.
కాగా, గత యేడాది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్న్ కంటెంట్ వీడియో తయారీ కేసులో అరెస్టయ్యారు. ఈ కేసులో శిల్పాశెట్టిని కూడా పోలీసులు విచారించారు. ఆ తర్వాత సెప్టెంబరు నెలలో ఆయనకు బెయిల్ మంజూరైంది.