శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (12:19 IST)

బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్‌కు ఈడీ సమన్లు

బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తేరుకోలేని షాకిచ్చింది. పనామా పత్రాల లీకేజీ కేసులో ఆమెకు ఈడీ సమన్లు జారీచేసింది. సోమవారం ఆమె ఈడీ కార్యాలయానికి హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.

అయితే, ఈ రోజు తాను విచారణకు రాలేని, విచారణకు మరో తేదీని మార్చాలని ఐశ్వార్యా రాయ్ ఈడీ అధికారులను కోరినట్టు సమాచారం. దీనిపై ఈడీ అధికారులు స్పందించాల్సివుంది. 
 
ఇదిలావుంటే, పనామా కేసులో ఐశ్వర్యా వాంగ్మూలానాన్ని ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు. ఈమెకు ఇదే కేసులో గతంలో ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసింది. అపుడు కూడా ఆమె విచారణ తేదీలను మార్చాలని కోరారు. 
 
మరోవైపు, ఈ కేసులో ఆమె భర్త, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌కు ఈడీ అధికారులు సమన్లు జారీచేసి విచారించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో ఆయన ఈడీకి కొన్ని పత్రాలను అందచేసినట్టు సమాచారం. కాగా, అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ పనామా కేసులో విచారణ ఎదుర్కొంటుండటం ఇపుడు బాలీవుడ్ చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.