పసిడి ప్రియులకు చేదు వార్త.. పెరిగిన బంగారం ధరలు
దేశంలోని పసిడి ఆభరణాలకు ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా, మగువలు అమితంగా ఇష్టపడే పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. కానీ ఇపుడు శుక్రవారం పలు నగరాల్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరిగితే, మరొకొన్ని చోట్ల తగ్గాయి.
దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధర తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 47140గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.51420గా ఉంది. అదేవిధంగా ముంబైలో 10 గ్రాముల బంగారం ధరపై రూ.440 పెరిగింది. ఫలితంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.47350గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48350గా ఉంది.
ఇకపోతే, హైదరాబాద్ నగరంలో ఈ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇక్కడ పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45300గాను, 24క్యారెట్ల బంగారం ధరలు రూ.49420గాను ఉంది. అదేవిధంగా విజయవాడ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45300గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49420గా ఉంది.