బాలీవుడ్‌లో సినిమాలు విడుదల వద్దన్న సల్మాన్
RRR prerelease
ఆమధ్య రాజమౌళి ముంబై వెళ్ళి సల్మాన్ ఖాన్‌ను కలిసివచ్చాడు. అది పెద్ద వైరల్ అయింది. తాజాగా ఆర్.ఆర్.ఆర్. హిందీ ప్రీరిలీజ్ ముంబైలో చేశారు. ఈ వేడుక కి సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు.
సల్మాన్ మాట్లాడుతూ, ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయిన నాలుగు నెలల వరకు ఏ ఇండియా ఫిల్మ్ ను రిలీజ్ చేయడానికి సాహసించకండి అని వ్యాఖ్యానించారు. కరణ్ జోహార్ ఈ ఈవెంట్ కి వ్యాఖ్యాత గా వ్యవహరించగా, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో పాటుగా అలియా భట్, శ్రియ శరణ్ లు వేడుక కి హాజరు అయ్యారు. వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన సినిమా విడుదల కాబోతోంది.
