గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (08:28 IST)

సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్న కిడాంబి శ్రీకాంత్ - గంటూరు కుర్రోడికి అందలం

స్పెయిన్‌లో జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిఫ్ ఫైనల్ పోటీల్లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్ టైటిల్ సమరంలో శ్రీకాంత్ 15-21, 20-22 తేడాతో సింగపూర్‌కు చెందిన కీన్ యూ చేతిలో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. 
 
తొలి గేమ్‌లో పేలవంగా ఆడిన శ్రీకాంత్.. రెండో గేమ్‌లో పోరాటపటిమ చూపించినప్పటికీ అప్పటికే మ్యాచ్ తన చేతుల్లోని చేజారిపోయింది. ఫలితంగా కీ యూ విజయం సాధించగా, కిడాంబి ఓటమి పాలయ్యాడు. దీంతో తృటిలో బంగారు పతకాన్ని కోల్పోయాడు. అయితే, సిల్వర్ మెడల్ సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 
 
మరోవైపు, గుంటూరు యువ క్రికెటర్‌కు అరుదైన ఘన సాధించాడు. వచ్చే యేడాది ప్రథమార్థంలో వెస్టిండీస్ వేదికగా జరిగే అండర్-19 ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొనే భారత అండర్-19 జట్టుకు వైస్ కెప్టెన్‌గా గుంటూరుకు చెందిన షేక్ రషీద్ నియమితులయ్యాడు. ఈ టోర్నీ 2022 జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇందుకోస 17 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది.