ఆదివారం, 3 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (15:15 IST)

సారీ చెప్పినా సద్దుమణగని వివాదం : హీరోకు చెన్నై పోలీసుల నోటీసులు

టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చిక్కుల్లోపడ్డారు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిని సైనా నెహ్వాల్‌కు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. జాతీయ మహిళా సంఘం రాసిన లేఖ మేరకు సిద్ధార్థ్‌కు చైన్నై నగర పోలీసులు సమన్లు జారీచేశారు. అయితే, ఆయన వద్ద ఏ విధంగా విచారణ జరపాలన్న అంశంపై వారు మల్లగుల్లాలు పడుతున్నారు. చెన్నైలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో ఆయన వద్ద ప్రత్యక్ష విచారణ జరిపే అంశంపై తర్జనభర్జన చెందుతున్నారు. 
 
ఇటీల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన భద్రతా లోపం కారణంగా అర్థాంతరంగా వాయిదాపడింది. దీనిపై సైనా నెహ్వాల్ ట్వీట్ చేస్తూ, ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. పైగా, ప్రధానికే రక్షణ లేకుంటే ఈ దేశం భద్రతగా ఎలా ఉంటుందంటూ ట్వీట్ చేశారు. దీనిపై హీరో సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. "చిన్న కాక్‌తో ఆడే ఆటలో ప్రపంచ చాంపియన్... దేవుడు దయ వల్ల మనకు దేశాన్ని కాపాడేవాళ్లున్నారు" అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 
 
ఈ ట్వీట్‌ను జాతీయ మహిళా సంఘం తీవ్రంగా పరిగణించింది. హీరో సిద్ధార్థ్‌పై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు రాష్ట్ర డీజీపీకి ఇటీవల లేఖ రాసింది. దీంతో చెన్నై పోలీసులు హీరో సిద్ధార్థ్‌పై కేసు నమోదు చేశారు. ఇదిలావుంటే, తాను చేసిన వ్యాఖ్యలకు సైనా నెహ్వాల్‌కు సిద్ధార్థ్ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పిన విషయం తెల్సిందే.