బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (11:19 IST)

హీరో సూర్య కొత్త చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్

వైవిధ్యమైన కథలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే కథానాయకుడిగా సూర్యకు తమిళ చిత్రపరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. తాను నటించే సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా జాగ్రత్త వహిస్తుంటారు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే మాత్రం తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్మెంట్ బ్యానరులో ఓ చిత్రాన్ని నిర్మించి దాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తుంటారు. అలా గత యేడాది వచ్చిన చిత్రమే జైభీమ్. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కనక వర్షం కురిపించింది. 
 
ఈ కరోనా లాక్డౌన్ సమయంలోనే ఆయన రెండు చిత్రాల్లో నటించి ఓటీటీలో రిలీజ్ చేశారు. వీటిలో మొదటిది 'ఆకాశం నీ హద్దురా'. రెండోది 'జైభీమ్'. ఈ రెండు చిత్రాలు అనూహ్యమైన ఆదరణ పొందాయి. ఆయన తాజా చిత్రంగా 'ఎదర్కుం తుణిందవన్" పేరుతో ఓ చిత్రంలో నటించారు. దీన్ని తెలుగులో ‘ఈటి’ టైటిల్‌తో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది.
 
ఈ చిత్రం మార్చి 10న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. తెలుగులో సూర్య తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయిక. ఇమాన్ సంగీతం అందిస్తుండగా సత్యరాజ్ .. శరణ్య ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.