బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Modified: శనివారం, 12 ఫిబ్రవరి 2022 (16:59 IST)

సూర్య న‌టించిన ET తెలుగు హక్కులను ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కైవ‌సం చేసుకుంది

Suriya
కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో విమర్శకుల ప్రశంసలు పొందిన `ఆకాశం నీ హద్దురా`,  జై భీం` సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందిన బహుముఖ నటుడు సూర్య,  తాజాగా పాండిరాజ్ దర్శకత్వంలో  రూపొందిన‌ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ET (ఎతర్క్కుం తునిందావన్)తో రాబోతున్నాడు. సన్ పిక్చర్స్ బేన‌ర్‌లో కళానిధి మారన్ నిర్మించారు.
 
టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకుంది. సూర్యకు ఉన్న భారీ మార్కెట్ విలువను దృష్టిలో ఉంచుకుని, తెలుగులో ET పేరుతో ఈ సినిమా హక్కులు ఫ్యాన్సీ ధరకు అమ్ముడయ్యాయి. తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10, 2022న ఒకేసారి విడుదల కానుంది.
 
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్య తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవ‌డ‌మే. డబ్బింగ్ స్టూడియోలో వున్న సూర్య ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్, డి ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సూర్య‌కు ప్రేయ‌సిగా ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. ఈ చిత్రంలో వినయ్ రాయ్, సత్యరాజ్, రాజ్‌కిరణ్, శరణ్య పొన్వన్నన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
ET తెలుగులో గ్రాండ్ రిలీజ్ అవుతుంది, ఏషియన్ సినిమాస్ ఇక్కడ రిలీజ్ చేస్తుంది.