శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఫిబ్రవరి 2022 (12:13 IST)

KCR యాదాద్రి పర్యటన: రాయగిరిలో బహిరంగ సభ

తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రిలో పర్యటించనున్నారు. శుక్రవారం జనగామలో పర్యటించిన సీఎం కేసీఆర్ నూతన కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగసభలో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 
 
తాజాగా ఫిబ్రవరి 12వ తేదీ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. యాదాద్రిలో నిర్మించిన ప్రెసిడెన్షియల్స్‌ సూట్స్‌ను కేసీఆర్ ఈ సందర్భంగా ‌ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు సుదర్శన మహా యాగం కోసం ఏర్పాటు చేసి యాగశాల పరిశీలించనున్నారు. అక్కడి నుంచి భువనగిరికి బయలుదేరుతారు. భువనగిరిలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
 
సాయంత్రం 4 గంటలకు రాయగిరి వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం కేసీఆర్. భువనగిరిలో జరిగే బహిరంగ సభ సక్సెస్ కోసం ఆ పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.