శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (17:11 IST)

మంత్రి బొత్స కుమారుడి వివాహానికి హాజరైన సీఎం దంపతులు

మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహా వేడుకకు ఏపీ సీఎం జగన్ దంపతులు హాజరయ్యారు. 
 
మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్స్‌లో జరిగిన ఈ వివాహా వేడుకలో వరుడు డాక్టర్‌ లక్ష్మీనారాయణ్‌ సందీప్, వధువు పూజితలను ఆశీర్వదించారు.
 
ఈ సందర్భంగా జగన్‌ను కలిసేందుకు ప్రముఖులు ఎగబడ్డారు. అయితే భారీ భద్రత నడుమ సీఎం వధూవరులను ఆశీర్వదించి తాడేపల్లి చేరుకున్నారు.