సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (07:31 IST)

హాస్య నటుడు అలీకి బంపర్ ఆఫర్ .. ఏంటది?

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్య నటుడు అలీ నక్కతోకను తొక్కినట్టున్నారు. తెలుగు చిత్రపరిశ్రమ సమస్యల పరిష్కారం తెలుగు అగ్రహీరోలు గురువారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సమావేశంలో సినీ సమస్యలకు పరిష్కార మార్గం లభించిందో లేదో గానీ... హాస్య నటుడు అలీకి మాత్రం బంపర్ టిక్కెట్ తగ్గినట్టు తెలుస్తోంది. 
 
తాడేపల్లి రాజకీయ వర్గాల విశ్వసనీయ సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అలీని ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుండి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ చేయాలన్న తలంపులో సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో వారం రోజుల తర్వాత తనను వచ్చి కలవాల్సిందిగా అలీని సీఎం జగన్ కోరారు. 
 
దీంతో అలీకి రాజ్యసభ సీటు ఇచ్చేందుకే జగన్ అలా చెప్పారనే టాక్ మొదలైంది. త్వరలో రాజ్యసభకు నాలుగు స్థానాలు ఖాళీ కానుండటంతో వైఎస్సార్‌సీపీకి నలుగురు ప్రతినిధులను పంపే అవకాశం ఉంది. ఇంకా, వైఎస్సార్‌సీపీకి అవసరమైన సంఖ్యాబలం ఉన్నందున ఎన్నికలు క్యాట్‌వాక్‌గా మారాయి.