శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (17:21 IST)

ఏపీ మంత్రి పేర్ని నానికి మోహన్ బాబు ఇంట ఆతిథ్యం .. టాలీవుడ్‌కు షాక్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు అంశంపై వివాదం సాగుతోంది. ఇతర సమస్యల పరిష్కారం కోసం తెలుగు హీరోలైన చిరంజీవి, ప్రభాస్, మహేష్, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ వంటి వారు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే అంశంపై గురువారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో టాలీవుడ్ హీరోలు చర్చలు కూడా జరిపారు. ఈ చర్యల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు ఆయన తండ్రి డాక్టర్ మోహన్ బాబు పాలు పంచుకోలేదు. 
 
దీనిపై టాలీవుడ్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి హీరో మోహన్ బాబు ఏకంగా తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారు. హైదరాబాద్ వెళ్లిన మంత్రి పేర్ని నాని శుక్రవారం మంచు ఫ్యామిలీ ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గురువారం సీఎం జగన్‌తో భేటీ సందర్భంగా జరిగిన విషయాలను మోహన్ బాబుకు మంత్రి పేర్ని నాని వివరించారు. 
 
ఈ విషయాన్ని హీరో మంచు విష్ణు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. "ఈ రోజు మా ఇంట్లో మీకు ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది నాని గారు. టిక్కెట్ ధరలపై మీరు చూపిన చొరవ, మరియు తెలుగు చిత్రపరిశ్రమ కోసం ఆంధ్రప్రదేశ్ చేపట్టిన కొత్త పథకాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. తెలుగు చిత్రపరిశ్రమ ప్రయోజానాలను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశారు.