బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఫిబ్రవరి 2022 (16:04 IST)

ఏపీ మంత్రి పేర్ని నాని, మోహన్‌బాబు భేటీ: ట్వీట్ ఎడిట్ చేసిన మంచు విష్ణు

Nani_Vishnu_Mohan Babu
ఏపీ మంత్రి పేర్ని నాని మోహన్‌బాబును కలిసిన సందర్భంగా మొదట ట్వీట్‌ చేసిన మా అధ్యక్షులు మంచు విష్ణు తర్వాత దాన్ని ఎడిట్‌ చేశారు. ముందుగా మీకు ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని.. సినీ పరిశ్రమ కోసం ఏపీ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్‌ల గురించి అప్‌డేట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు. దీంతో ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వం దగ్గరికి వెళ్లి చర్చలు జరిపితే.. మోహన్‌బాబు ఇంటికి మంత్రి వెళ్లడంపై హాట్‌టాపిక్‌ నడిచింది. 
 
మోహన్‌బాబుకు మెగా మీటింగ్‌ గురించి వివరించాల్సిన అవసరం ఏం వచ్చిందనే చర్చ జరిగింది. ఇదే సమయంలో మంచు విష్ణు తన ట్వీట్‌ నుంచి అప్‌డేట్‌ మ్యాటర్‌ను తొలగించేశారు. ఇది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
 
మంత్రి పేర్ని నాని రాకపై కొద్దిసేపటి క్రితం పెట్టిన పోస్ట్‌ను మంచు విష్ణు ఎడిట్ చేశారు. ఆ పోస్ట్‌లో టిక్కెట్ ధరలు, ఏపీ ప్రభుత్వ ప్లాన్‌లు తెలియచేసినందుకు ధన్యవాదములు అంటూ ట్వీట్ చేశారు. అయితే ఆ పోస్టును మంచు విష్ణు ఎడిట్ చేశారు. తాజాగా మంచు విష్ణు మరో ట్వీట్ పోస్టు చేశారు. ‘మా ఇంట్లో మీకు ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది నాని గారు. TFI ప్రయోజనాలను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
 
ఇకపోతే సీఎం జగన్‌తో చిరు టీమ్ మీటింగ్‌లో జరిగిన విశేషాలను మోహన్ బాబుతో చర్చించినట్లుగా తెలుస్తోంది. మోహన్ బాబు ఇంట్లో దాదాపు 15 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఈ భేటీలో నిన్నటి సమావేశంలో చర్చించిన పలు అంశాలను కూడా వివరించినట్లుగా సమాచారం. అయితే దీనిపై మంచు విష్ణు కూడా ట్వీట్ చేశారు.