బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (16:28 IST)

అగ్రహీరోల అభిమానుల మధ్య ట్విట్టర్ వార్

తెలుగు, తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్ర హీరోల మధ్య ట్విట్టర్ యుద్ధమొదలైంది. ఈ నెల 14వ తేదీన హీరో మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం మొదటి పాట విడుదల కానుంది. అదే రోజున తమిళ హీరో విజయ్ నటించిన "బీస్ట్" సింగిల్ కూడా విడుదలకానుంది. దీంతో తమతమ హీరోల పాటను సంతోషంగా ఆలకించాల్సిన ఈ ఇద్దరు హీరోల అభిమానులు ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధానికి దిగారు. 
 
యూట్యూబ్‌లో 'బీస్ట్‌' ట్రాక్స్ లైక్స్‌ను పెంచడానికి విజయ్ అభిమానులు బాట్స్‌ను ఉపయోగిస్తారని, మహేష్ ఫ్యాన్స్ ఆరోపించారు. దాంతో విజయ్ అభిమానులు మహేష్ ఫ్యాన్స్ ఫౌల్ క్రై చేస్తున్నారంటూ దండయాత్ర ప్రారంభించారు. ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ట్వీట్ వార్ తీవ్రరూపం దాల్చి ఆపై నెగెటివ్ ట్రెండ్స్‌తో దాడి మొదలుపెట్టారు. 
 
నిజానికి ఈ రెండు సినిమాల పాటలు వినడానికి ఇంకా సమయం ఉంది. అయితే ఇరువురు హీరోల అభిమానులు మాత్రం ఇలా ట్విట్టర్‌లో మాటల యుద్ధం చేసుకోవడం గమనార్హం. కాగా, గతంలో హీరో విజయ్ అనేక తెలుగు చిత్రాలను రీమేక్ చేసి స్టార్ హీరో రేంజ్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే.