శుక్రవారం, 29 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 28 ఆగస్టు 2025 (16:32 IST)

ట్రంప్ ఫోన్ కాల్‌ని లిఫ్ట్ చేయని ప్రధాని మోడి?, ట్రంప్ నెత్తిపైన టారిఫ్‌ల తాటికాయ

Trump-Modi
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశ ఎగుమతులపై 50 శాతం టారిఫ్ లు విధింపు ఈరోజు నుంచి అమలులోకి వచ్చేసాయి. ఐతే ఈ విధింపులకు భారత్ భయపడి కాళ్లబేరానికి వస్తుందనుకున్నారు ట్రంప్. కానీ ప్రధాని మోడి ఎలాంటి జంకు లేకుండా తన పని తను చేసుకుపోతున్నారు. టారిఫ్‌లకు బెంబేలెత్తిపోయి ప్రధాని మోడి తనకు కాల్ చేస్తారనుకున్నారు ట్రంప్. ఐతే సీన్ రివర్స్ కావడంతో స్వయంగా ట్రంప్ నేరుగా ప్రధానికి 4 సార్లు ఫోన్ చేసారట.
 
ఆ ఫోన్ కాల్స్‌ని ప్రధాని లిఫ్ట్ చేయలేదంటూ జర్మనీ పత్రిక ఉటంకించింది. దీనికి కారణాన్ని కూడా రాసుకొచ్చింది. అమెరికాకి గుణపాఠం చెప్పేందుకు ప్రధాని మోడి ఇతర దేశాలకు తమ ఎగుమతులను పంపే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
 
ముఖ్యంగా చైనా-భారతదేశం ఆర్థిక ప్రణాళికల గురించి చర్చించుకుంటున్నాయంటూ బాంబు పేల్చారు. దీనితో భారత్ ట్రంప్ పైన పెట్టిన రివర్స్ ప్రెజర్‌తో అమెరికా అధ్యక్షుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. అంతేకాదు... అమెరికా నుంచి భారీగా దిగుమతి అవ్వాల్సిన ఉత్పత్తులను క్రమంగా తగ్గించే పనిలో వున్నారట. దీంతో ట్రంప్ నెత్తిపైన తాటికాయ పడ్డట్లయ్యిందని అంతర్జాతీయ మీడియా కథనాలు రాస్తోంది.