కొత్త యాడ్ కోసం భారీగా వసూలు చేసిన స్టార్ హీరో?
సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు చేతులా అర్జిస్తున్నారు. ఒకవైపు తాను నటించే చిత్రాలకు భారీ మొత్తంలో రెమ్యునకేషన్ తీసుకుంటున్నారు. మరోవైపు వాణజ్య ప్రకటనలో నటిస్తూ కోట్లాది రూపాయల మేరకు తీసుకుంటున్నారు.
తాజాగా ఆయన కొత్త మౌంటెన్ డ్యూ కోసం కొత్త యాడ్ చేశారు. ఇది అతని ఫాలోవర్స్, అభిమానులను, నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే మౌంటెన్ డ్యూ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబు నియమితులైన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ ప్రకటన కోసం మహేష్ బాబు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మౌంటైన్ డ్యూ అడ్వర్టైజ్‌మెంట్ కోసం మహేష్ బాబు 12 కోట్ల రూపాయలను తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ ప్రకటనలో దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో స్టంట్ సన్నివేశాలు ఉన్నాయి. మహేష్ బాబు కమర్షియల్ అడ్వర్టైజ్‌మెంట్‌కి ఇది అత్యధిక రెమ్యూనరేషన్ అని, ఇది ఉత్పత్తి అమ్మకాలను పెంచుతుందని నిర్వాహుకులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.