1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. woman attack on apsrtc driver in vijayawada

ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ దాడి..

woman
ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ మహిళ దాడిచేసింది. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. కాలితో తన్ని.. చొక్కాను పట్టుకుని దాడిచేసింది. వివరాల్లోకి వెళితే.. మూడున్నర గంటల సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ విద్యాధరపురం డిపోకు చెందిన బస్సు ప్రకాశం రోడ్డులో వెళ్తోంది. 
 
అదే సమయంలో ఆంధ్రా ఆసుపత్రి సమీపంలో కృష్ణలంక తారకరామానగర్‌కు చెందిన నందిని అనే మహిళ ద్విచక్ర వాహనంపై వెళ్తూ బస్సుకు అడ్డం వచ్చింది. డ్రైవర్ ముసలయ్య సడెన్ బ్రేక్ వేయడంతో బస్సు ఆమె ద్విచక్ర వాహనం సమీపంలోకి వచ్చి ఆగింది
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ వెంటనే బస్సెక్కి డ్రైవర్‌పై దాడిచేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్, మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడిచేసిన మహిళపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గృహనిర్భంధం