గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (10:55 IST)

తగ్గిన కోవిడ్ కేసులు - పెరిగిన మరణాలు

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బాగా తగ్గిపోతున్నాయి. అయితే, మరణాలు మాత్రం తగ్గడ లేదు. గడిచిన 24 గంటల్లో 1241 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో కొత్తగా 67,084 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 
 
రోజువారీ పాజిటివిటీ రేటు 4.4 శాతంగా ఉంది. దేశంలో 7,90,789 మంది కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా హోం, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే, గడిచిన 24 గంటల్లో 1,67,882 మంది కోలుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.