గురువారం, 18 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (16:56 IST)

కోవిడ్‌పై పోరు.. భారత మార్కెట్లోకి తొలి నాసల్ స్ప్రే

Nasal spray
కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు తొలి నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే మార్కెట్లో విడుదలైంది. కోవిడ్ బారిన పడిన పెద్దలకు చికిత్స అందించేందుకు గాను.. గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ దాని భాగస్వామి కెనడియన్ బయోటెక్ కంపెనీ సనోటైజ్ రీసెర్చ్ బుధవారం మార్కెట్లో నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే (ముక్కు ద్వారా వ్యాక్సిన్)ను విడుదల చేసింది. గ్లెన్‌మార్క్ సంస్థ దీనిని ఫాబిస్ప్రే బ్రాండ్ పేరుతో మార్కెట్ చేస్తుంది. 
 
నైట్రిక్ ఆక్సైడ్ నాసల్‌ను నాసికా శ్లేష్మంపై స్ప్రే చేసినప్పుడు, అది వైరస్‌కు వ్యతిరేకంగా భౌతిక, రసాయన అవరోధంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ ప్రకటనలో, "FabiSpray"ను రూపొందించడం జరిగింది. ఇది COVID 19 వైరస్‌ను చంపగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇది SARS CoV 2పై ప్రత్యక్ష యాంటీవైరల్ ప్రభావంతో యాంటీ మైక్రోబయల్ లక్షణాలను నిరూపితం అయ్యినట్లు పేర్కొన్నారు.
 
ఫ్యాబిస్ప్రే అనేది కోవిడ్ 19 వైరస్‌ను ముక్కు లోపల ఉండేలా నాశనం చేసేందుకు రూపొందించడం జరిగింది. అయితే, అది ఊపిరితిత్తులకు చేరదు. డ్రగ్ రెగ్యులేటర్ అయిన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నుండి నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే యాక్సిలరేటెడ్ అప్రూవల్ ప్రాసెస్ తయారీ మార్కెటింగ్ కోసం వేగవంతమైన ఆమోదం పొందింది.