సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (10:25 IST)

దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీ తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 64,597 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఈ వైరస్ నుంచి 1,80,456గా ఉందని తేలింది. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 1188 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా హోం క్వారంటైన్లలో 9,94,891 మంది చికిక్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలుపుకుంటే ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 5,02,874కు చేరింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా ఉంది.