గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (08:54 IST)

భారత్-పాకిస్థాన్ సమరం.. హాట్ కేకుల్లా అమ్ముడుబోయిన టిక్కెట్లు

ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మరోమారు తలపడనున్నాయి. ఈ టోర్నీకి సంబంధించిన టికెట్ల విక్రయం సోమవారం ప్రారంభం కాగా, దాయాదుల మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. గంటలోపే టికెట్లు అన్నీ ఖాళీ అయిపోయాయి. 
 
ఈ ఏడాది అక్టోబరు 16 నుంచి నవంబరు 13 మధ్య ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. అక్టోబరు 23న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడతాయి. ఫైనల్‌తో మొత్తం 45 మ్యాచ్‌ల టికెట్లను కూడా విక్రయానికి ఉంచారు. అడిలైడ్, బ్రిస్బేన్, జీలాంగ్, హాబర్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీలలో మ్యాచ్‌లు జరుగుతాయి.
 
తమ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకుండా కేవలం ఐసీసీ టోర్నమెంట్లలోనే చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. దీంతో ఈ రెండు జట్లు ఆడే మ్యాచ్‌లకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ప్రపంచకప్ టిక్కెట్లను ఫైనల్‌తో సహా మొత్తం 45 మ్యాచ్‌ల టికెట్లను అధికారులు విక్రయానికి ఉంచారు.