ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (15:42 IST)

సురేష్ రైనా తండ్రి త్రిలోక్ చంద్ రైనా కన్నుమూత

భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా తండ్రి త్రిలోక్ చంద్ రైనా కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈయన మిలిటరీ అధికారిగా పని చేశారు. అలాగే, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో బాంబుల తయారీలోనూ అనుభవం గడించారు. 
 
ఈయన సొంతూరు జమ్మూకాశ్మీర్‌లోని రైనావరి గ్రామం. 1990లో కాశ్మీర్ పండిట్ల హత్యల ఘటన తర్వాత ఆయన గ్రామాన్ని విడిచిపెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మురాద్‌ నగర్‌లో స్థిరపడ్డారు. ఆ సమయంలో తనకు వచ్చే రూ.10 వేల  వేతనంతోనే ఆయన తన కుటుంబాన్ని పోషిస్తూ, కుమారుడు సురేష్ రైనాకు క్రికెట్‌లో శిక్షణ ఇప్పించారు.