సీఎం కేసీఆర్ మేనమాన గునిగంటి కమలాకర్ రావు ఇకలేరు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు ఇంట్లో విషాదం నెలకొంది. సీఎం కేసీఆర్ మేనమామ గునిగంటి కమలాకర్ రావు మృతి చెందారు. ఆయనకు వయసు 94 యేళ్లు. శనివారం కామారెడ్డి పట్టణంలోని దేవి విహార్‌లోని తన నివాసంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. ఈ మరణవార్త తెలియగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కామారెడ్డికి చేరుకున్నారు.
కాగా, మేనమామ కమలాకర్ రావు మతిపట్ట సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. రాజంపేట మండలం అర్గొండ గ్రామానికి చెందిన కమలాకర్ రావు చాలా కాలంగా కామారెడ్డి పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు.