శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (11:40 IST)

నేడు రంగనాథ స్వామి దర్శనానికి సీఎం కేసీఆర్ - రేపు సీఎం స్టాలిన్‌తో భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు రాష్ట్రం, తిరుచ్చి జిల్లాలో ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయానికి వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుచ్చికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రంగనాథ స్వామి ఆలయాలనికి చేరుకుంటారు. 
 
స్వామి దర్శనం అనంతరం ఆయన చెన్నైకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఇక్కడ నుంచి ఆయన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. 
 
కాగా, సీఎం స్టాలిన్‌తో జరిగే సమావేశంలో ధాన్య సేకరణతో పాటు, కనీస ధర కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపడుతుంది. పార్లమెంట్ వేదికగా తెరాస సభ్యులు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. ఈ విషయంలో డీఎంకే మద్దతును కూడగట్టే విషయంపై ఆయన చర్చించే అవకాశం ఉంది.