ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (20:23 IST)

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కోవిడ్ నెగటివ్..

కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ కొలుకున్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం.. సీఎం కేసీఆర్‌కు బుధవారం తన వ్యవసాయ క్షేత్రంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసియార్ పరీక్షలు నిర్వహించారు. 
 
యాంటిజెన్ టెస్టులో సిఎం కెసిఆర్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. ఇక ఆర్టీపీసియార్ పరీక్షా ఫలితాలు రేపు రానున్నాయి. కాగా కేసీఆర్‌కు ఈ నెల 19 న కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత మంత్రి కేటీఆర్‌కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.
 
లంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డీహెచ్ వో శ్రీనివాస్ వెల్లడించారు. అయితే..పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని, వచ్చే మూడు, నాలుగు చాలా కీలకమని అభివర్ణించారు. మే నెల చివరి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.