బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (12:28 IST)

కోవాగ్జిన్‌ టీకా 617 వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తుంది.. ఆంథోనీ ఫౌసీ

భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ టీకా 617 వేరియంట్లపై సమర్థవంతంగా పని చేస్తుందని అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, వైట్‌హౌస్‌ చీఫ్‌ మెడికల్‌ అడ్వైజర్‌ ఆంథోనీ ఫౌసీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కాన్ఫరెన్స్‌ కాల్‌ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. 
 
ఇటీవల కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న వారికి సంబంధించిన సమాచారాన్ని పరిశీలించాక నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో కొనసాగుతున్న పరిస్థితులకు, మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషనే ఏకైక విరుగుడని ఫౌసీ సూచించారు.
 
అలాగే సార్క్‌-కోవ్‌-2 వైరస్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలు విడుదల చేయడంలో కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ పని చేస్తుందని న్యూయార్క్‌ టైమ్స్‌ సైతం పేర్కొంది. నేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) భాగస్వామ్యంతో భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసింది. 
 
ఈ ఏడాది జనవరి 3న దేశంలో అత్యవసర వ్యాక్సిన్‌ వినియోగం కోసం అనుమతి పొందింది. క్లినికల్‌ ట్రయల్స్‌ తర్వాత టీకా 78శాతం సమర్థవంతంగా పని చేస్తుందని తేలింది.