1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (09:09 IST)

సీఎం స్టాలిన్ తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు : మద్రాస్ హైకోర్టు ప్రశంసలు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ప్రశంసల వర్షం కురిపించింది. సీఎంగా స్టాలిన్ తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తున్నారంటూ కితాబిచ్చింది. పైగా, ఆయనపై అనవసరంగా విమర్శలు చేస్తే సహించమని ఓ నిందితుడికి హెచ్చరించింది. 
 
మదురైకు చెందిన సాట్టై మురుగన్ అనే వ్యక్తి ఓ కేసులో నిందితుడుగా ఉంటూ, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈయన ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్‌పై పలు విమర్శలు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు జామీను కోరుతూ సాట్టై మురుగన్ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌ను ఆశ్రయించారు. 
 
ఈ కేసు గురువారం న్యాయమూర్తి పుగళేంది ముందుకు విచారణకు వచ్చింది. స్టాలిన్ తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నారన్నారు. అలాంటి వ్యక్తిని అభినందించకపోయినా ఫర్వాలేదు గానీ, ఆయన్ను విమర్శించడాన్ని కోర్టు సహించదన్నారు. 
 
పైగా, తమిళనాడు ప్రభుత్వం ఏం తప్పులు చేస్తే గుర్తించారు? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. కోర్టుకు ఇచ్చిన హామీని అధిగమించి ఇకపై ఒక్క మాట మాట్లాడినా ముందుస్తు జామీను రుద్దు చేస్తామని హెచ్చరించారు.