1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 9 అక్టోబరు 2021 (14:30 IST)

మహిళలకు అలంబనగా సీఎం జగన్... ఇళ్ల పట్టాలన్నీ మహిళల పేరిటే

ఎక్కడైతే మహిళలు పూజలందుకుంటారో, అక్కడ దేవతలు కొలువుంటారన్న సత్యాన్ని నమ్మిన నాయకునిగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మహిళా ప్రగతికి ఆలంబనగా నిలుస్తున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శనివారం సారవకోట మండలం కొత్తూరు జంక్షన్ గౌరీ శంకర్ కళ్యాణ మండపంలో వైయస్సార్ ఆసరా రెండో విడత సంబరాలకు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలకు సముచిత స్థానాన్ని ఇవ్వడంలో దేశంలో అందరికంటే సీఎం జగన్ ముందు వరసలో నిలుస్తున్నారని అన్నారు. 
 
 
నామినేటెడ్ పోస్టులు మొదలుకుని అన్నింటా మహిళలకు 50శాతం భాగస్వామ్యాన్ని కల్పించారని అన్నారు. లక్షలాది ఇళ్ల పట్టాలన్నీ మహిళల పేరిటే ఇచ్చారన్నారు. మహిళలను టీడీపీ పాలకులు దగా చేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు రకరకాల జిమ్మిక్కులు చేసి మహిళలకు ప్రాధాన్యం  ఇస్తున్నట్టు నాటకాలు ఆడిన టీడీపీ నాయకులను మహిళలే తిరస్కరించారన్నారు. వారి మోసాలతో నష్టపోయిన ప్రజలంతా టీడీపీని దూరం పెట్టారని అన్నారు. సీఎం జగన్ తాను ఏది చెప్పారో అదే ప్రజలకోసం చేస్తున్నారని అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే ఇప్పటికే 97 శాతం హామీలను అమలుచేసి రికార్డు సృష్టించారని అన్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధతగల ఉత్తమ నాయకుడు సీఎం జగన్మోహనరెడ్డి మాత్రమేనని అన్నారు. తాను ఈ రోజు డిప్యూటీ సీఎంగా మీ అందరి ముందూ నిల్చొని ఉన్నానంటే నాపై మీ అందరూ చూపించిన అంతులేని ప్రేమాభిమానాలు, ఆదరణేనని అన్నారు. మీరిచ్చిన గౌరవానికి ఏమిచ్చి మీరుణం తీర్చుకోగలనని అన్నారు. 
 
ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులకు నమూనా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సారవకోట ఎంపీపీచిన్నాల కుర్మినాయడు, జడ్పీటీసీ వరుదు నాగేశ్వరమ్మ, డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ నక్క తులసిదాస్, వైస్ ఎంపీపీ రామారావు పార్టీ అధ్యక్షులు గెల్లంకి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.