సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (08:38 IST)

మన కష్టం తెలిసిన వ్యక్తి సీఎం జగన్: మంత్రి నాని

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి కష్టం తెలిసిన వ్యక్తి  సీఎం జగన్ అని మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

సుమారు రూ.30 లక్షలతో పంచాయతీ రాజ్, మత్స్యశాఖ నిధులతో భవనాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. మన కష్టం, నష్టం, రుచి తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు.

ఎన్ని కష్టాలు, ఆర్థిక బాధలు ఎదురైనా అప్పులు తీసుకురాకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నా, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని ఆయన కొనియాడారు.

గుజరాత్‌లోని డ్రగ్స్ కేసులను ఏపీ ప్రభుత్వానికి అంటగట్టినా, వాటిని లెక్క చేయని వ్యక్తి జగన్ అని ఆయన అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని మంత్రి పేర్ని నాని తెలిపారు.