శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (15:36 IST)

పప్పుబెల్లాలు పక్కనబెట్టి ఉద్యోగులకు జీతాలు ఇవ్వవయ్యా.. చింతా మోహన్

నవ రత్నాల పేరుతో ప్రజలకు పప్పు బెల్లాలు పంచడం పక్కనబెట్టి ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వవయ్యా స్వామీ అంటూ తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మాట్లాడుతూ, ఏపీ సర్కారు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి దిగజారిందన్నారు. ఆర్థికమంత్రి అప్పులు శాఖ మంత్రిగా మారారని ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వవయ్యా స్వామీ... పనిచేసిన వాళ్లకు జీతాలు ఇవ్వకపోతే ఎలాగ? అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేసారు. 'జీతాలు, పెన్షన్లు అందనివాళ్లు మాట్లాడుతుంటే అయ్యో అనిపించింది. డబ్బు అందకపోతే వాళ్లేం కావాలి?' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
'చెప్పుకోవడానికి మూడు రాజధానులేమిటి, 30 రాజధానుల పేర్లు చెప్పుకోవచ్చు, పేపర్లలో రాయించుకోవచ్చు. కర్నూలులో హైకోర్టు అంటున్నారు. ఎక్కడంటే అక్కడ పెట్టడానికి ఇదేమైనా హైస్కూలా...? ఈ అంశంలో వైసీపీ సర్కారు అనుభవలేమి బయటపడుతోంది. మంత్రులే నిర్ణయం తీసుకుంటున్నారు. వారికి ఎలా వ్యవహరించాలో తెలియదు. హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలో జడ్జిలు నిర్ణయించాలి. అభిప్రాయపడ్డారు.